Breaking News

కొత్త సంవత్సరంలో మోత్కుపల్లి దశ తిరగబోతోంది..

41388827156_625x300

మొత్తానికి మన ఫైర్ బ్రాండ్ మోత్కుపల్లి నర్సింహులుకు గవర్నర్ గిరీ దక్కబోతోందని టీడీపీ నాయకులకు సమాచారం అందిందట.. టీడీపీ అధినేత చంద్రబాబు.. తమ పార్టీకి ఇచ్చే గవర్నర్ పదవికి మోత్కుపల్లిని సిఫార్సు చేసిన సంగతి తెలిసిందే. దీంతో మోత్కుపల్లి కొద్దిరోజులుగా ఊహాలోకాల్లో తేలిపోతున్నారు. ఎప్పుడెప్పుడా అని వేచిచూసిన ఆ తరుణం రానే వచ్చింది..

మోత్కుపల్లి కొత్త సంవత్సరంలో దక్షిణాదిలోని ఓ రాష్ట్రానికి గవర్నర్ కాబోతున్నారట.. కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు గవర్నర్ గా మోత్కుపల్లిని అపాయింట్ చేయడానికి రంగం సిద్దం చేసినట్లు సమాచారం.. దీంతో మోత్కుపల్లి వర్గీయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.. తమ నేత ఇన్నాల్లు పడ్డ కష్టానికి ఫలితం దక్కిందని సంబర పడుతున్నారు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *