
నాగం జనార్ధన్ రెడ్డి బీజేపీని వీడుతున్నారు.. ఆయన బచావో తెలంగాణ మిషన్ పేరుతో కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించారు. ఇప్పటి వరకు మిషన్ బచావో తెలంగాణ పేరుతో రిజిస్ట్రేషన్ చేయించి రాజకీయ పార్టీగా మార్చాలన్న యోచనను విలేకరులతో తెలిపాడు..
కాగా కొద్దిరోజులుగా బీజేపీలో ఉన్న నాగం జనార్ధన్ రెడ్డి ఆ పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు.. ఆయన బీజేపీ నుంచి కాంగ్రెస్ లో చేరుతారనే ప్రచారం సాగింది. కానీ వాటన్నింటిని తోసిపుచ్చిన నాగం జనార్ధన్ రెడ్డి చివరకు తాను బచావో తెలంగాణ మిషన్ అనే కొత్త పార్టీ పెట్టబోతున్నట్టు ప్రకటించి సంచలనం రేపాడు. టీఆర్ఎస్ వ్యతిరేకులందర్ని ఒక తాటిపైకి తీసుకొచ్చి టీఆర్ఎస్ పై పోరాడుతానని ప్రకటించారు నాగం..