కొత్త గవర్నర్ల భర్తీకి కేంద్రం కసరత్తు

న్యూఢిల్లీ : కొత్త గవర్నర్ల నియమాకానికి కేంద్రం కసరత్తు చేస్తోంది. బీజేపీ హయాంలో గవర్నర్ల ఖాళీలు పెరిగిపోయాయి. ఒక్కో గవర్నర్ రెండు రాష్ట్రాల బాధ్యతలు చూస్తుండడం , కొన్ని చోట్ల ఏకంగా నాలుగు రాష్ట్రాల బాధ్యత చూస్తున్న నేపథ్యంలో త్వరలోనే తొమ్మిది రాష్ట్రాలకు నూతనంగా గవర్నర్లను నియమించనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
తెలంగాణ, అసోం, హిమాచల్ ప్రదేశ్, మేఘాలయ, మిజోరం, మణిపూర్, బీహార్, త్రిపుర, పంజాబ్ తదితర రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించే యోచనలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గవర్నర్ గా నియమితుడైన నరసింహన్ రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ , ఆంధ్రప్రదేశ్.. రెండు రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్ గా వ్యవహరిస్తున్నారు. ఒక గవర్నర్ ఇతర రాష్ట్రాలకూ ఇన్ చార్జులుగా వ్యవహరిస్తున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *