
ముంబై, ప్రతినిధి : బీసీసీఐ కొత్త కోచ్ ను వెతికే పనిలో పడింది. ప్రజెంట్ టీం కోచ్ గా ఉన్న డంకన్ ఫ్లెచర్ కాంట్రాక్ట్ ఈ వాల్డ్ కప్ తో కంప్లీట్ కానుంది. దీంతో టీంకు కొత్త కోచ్ ను తీసుకునే ప్రయత్నాలు స్టార్ట్ చేసింది బీసీసీఐ. అయితే వాల్డ్ కప్ కంటే ముందే వెళ్లిపోవాలని ఫ్లెచర్ డిసైడ్ అయ్యాడు. భార్య హెల్త్ కండిషన్ బాలేదని ముందుగానే వెళ్లేందుకు పర్మిషన్ ఇవ్వాలని బీసీసీఐని కూడా కోరాడంట. వాల్డ్ కప్ వరకూ టీంతో ఉండాలని బీసీసీఐ కూడా ఫ్లెచర్ ను కోరింది. దీంతో సాధ్యమైనంత వరకూ కొత్త కోచ్ ను సెలక్ట్ చేయాలని బీసీసీఐ ప్లాన్ చేస్తోంది.
కొత్త కోచ్ ల కోసం సీనియర్ల ఒపీనియన్ కూడా తెలుసుకున్నట్లు బీసీసీఐ చెప్పింది. ఇప్పటికే ధోని కూడా హస్సీ పేరును బీసీసీఐకి సిఫార్స్ చేశాడు. మరికొంత మంది కోచ్ ల పేర్లు పరిశీలిస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది.