
జగిత్యాల జిల్లా వెలగటూరు మండలం కొత్తపేట గ్రామం నుండి రైతు బంధు పథకానికీ ధర్మపురి శాసనసభ్యులు ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ గురువారంనాడు శ్రీకారం చుట్టారు. రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు పెట్టుబడి సహాయం చెక్కులు కొప్పుల ఈశ్వర్ అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం రైతన్నల సంక్షేమం కోసం మన రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రవేశపెట్టిన ఈ పథకం దేశ చరిత్రలోనే ఒక మరుపురాని మరువలేని ఘట్టానికి వేదికగా నిలుస్తుందన్నారు రైతు బంధు పథకం ఒక అద్భుతం రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకానికి 12 వేల కోట్ల నిధులు కేటాయించడం మరో చరిత్ర అన్నారు మొదటి విడతగా ఆరువేల కోట్ల నిధులు విడుదలయ్యాయని దీంతో రైతన్నల కుటుంబాల్లో సంతోషం వెల్లివిరుస్తుందని కొప్పుల ఈశ్వర్ అన్నారు రైతు బాంధవుడు మన కేసీఆర్ బంగారు తెలంగాణకు బాటలు వేస్తున్నారని అనేదానికి రైతు బంధు పథకం నిదర్శనమన్నారు బంగారు తెలంగాణ సాధన క్రమంలో ఇదొక మైలురాయి అని ఈశ్వర్ అన్నారు ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అధ్యక్షులు పొనుగోటి శ్రీనివాసరావు జెడ్ పి టి సి సభ్యులు పద్మ అశోక్ తదితరులు పాల్గొన్నారు