
సీఎం కేసీఆర్ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారం బహిరంగ సభలో కేటీఆర్ పై ప్రశంసలు కురిపించారు. శనివారం రాత్రి సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో జరిగిన టీఆర్ఎస్ బహిరంగ సభలో పాల్గొన్న కేసీఆర్ మాట్లాడారు.. ‘తన కొడుకు రామారావు హైదరాబాద్ లో ఒక్కతీరుగా ప్రచారం చేస్తుండు.. ఎక్కడికిపోయినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నరు.. నగర అభివృద్ధిలో మున్సిపల్ శాఖది కీలక పాత్ర.. ప్రస్తుతం నా దగ్గరే ఉన్న మున్సిపల్ శాఖను కేటీఆర్ కు అప్పచెప్పుతా’ అని సీఎం కేసీఆర్ బహిరంగ సభ సాక్షిగా ప్రకటించారు.. ఈ సందర్భంగా కేటీఆర్ ప్రచారాన్ని సమర్ధతను పొగిడారు..