
అధికార టీఆర్ఎస్ పార్టీ దూకుడుగా ముందుకెళ్తోంది.. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు చేసిన దానికంటే కూడా రెచ్చిపోతోంది. మహబూబ్ నగర్ లో జరిగిన జడ్పీ సమావేశంలో లొల్లి ఘటనతో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ధర్నా నిర్వహించారు. కానీ టీఆర్ఎస్ నాయకులు మాత్రం ఇఫ్పటివరకు స్పందించలేదు..
కేసీఆర్ మహబూబ్ నగర్ ఘటనపై కనీసం కూడా స్పందించలేదు.. అదేదో కామన్ సంఘటనగా వర్ణిస్తున్నారు. ఎమ్మెల్యే దూకుడుతో టీఆర్ఎస్ అధిష్టానం తల బొప్పి కడుతున్న కూడా టీఆర్ఎస్ కేసీఆర్ పట్టించుకోకపోవడం తీవ్ర పరిణామాలకు దారితీస్తోంది.. కాంగ్రెస్ శ్రేణులు అసెంబ్లీలో దీన్ని ప్రస్తావించే ప్రమాదం ఉంది. ఇప్పటికే వారందరూ తెలంగాణ వ్యాప్తంగా రోడ్డెక్కారు. ఇక ముందు స్పందించకుండా మరింత గందరోగళ పరిస్థితులు నెలకొంటాయి.
టీఆర్ఎస్ ఎమ్మెల్యే దూకుడు ఆ పార్టీకి కొంప ముంచేటట్టే కనపడుతోంది.. ఇలానే ముందుకెళ్తే నాయకుల్లో, ప్రజల్లో ఆ పార్టీ చులకన అయ్యే ప్రమాదం ఉంది.