
నాడు అన్న కోసం కొట్లాటకు పోయిండు.. కానీ మారిన మనిషిగా ఇప్పుడు నిలిచిండు.. ఓడలు బండ్లు అయినట్టే శత్రువులు మిత్రులయ్యారు. రాజకీయాల్లో, సినీ ఇండస్ట్రీలో శత్రువులు మిత్రులు ఉండరన్నది వాస్తవమే..
పవన్ కళ్యాన్ పుట్టిన రోజుకు ఒక విశిష్ట అతిథి నుంచి సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు, ఇంటికి ఒక బొకే అందిందట.. పవన్ అది చూసి కృతజ్ఞతలు చెప్పారట.. ఇంతకీ ఆ పెద్దాయన ఎవరో తెలుసా దాసరి నారాయణ రావు. అప్పట్లో దాసరి చిరంజీవి, రాంచరణ్ లపై దుమ్మెత్తిపోసినప్పుడు పవన్ దాసరిని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు.
కానీ ఇఫ్పుడు పవన్ పుట్టిన రోజు వేడుకకు దాసరి గిఫ్ట్ పంపడం.. శుభాకాంక్షలు తెలపడం వారిద్దరి మధ్య కొత్త స్నేహం చిగురించినట్టైంది. పాతవైరం పోయినట్టైంది..