Breaking News

కొండూరు జగన్మోహన్ రావుకు స్నేహరత్న పురస్కారం

కొండూరు జగన్మోహన్ రావుకు స్నేహరత్న పురస్కారం

కరీంనగర్ : మానవీయ విలువలు, నైతిక విలువలు పతనమవుతున్న ఈ రోజుల్లో మనుషులంతా ఏకమై స్నేహభావంతో మెలగాలని స్ఫూర్తి స్వచ్ఛంధ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు కొండూరు జగన్మోహన్ రావును యువత స్షూర్తిగా తీసుకోవాలని ప్రముఖ సామాజిక వేత్త ఎన్ఆర్ఐ బివిఆర్ అన్నారు. గురువారం శ్రీనివాస హోటల్ సమావేశమందిరంలో కళాస్రవంతి ఆధ్వర్యంలో సీనియర్ సిటిజన్ రోజున కళాసమితి వార్షిక సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సేవారత్న పురస్కార గ్రహీత స్షూర్తి సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు కొండూరు జగన్మోహన్ రావు మాట్లాడుతూ కళాస్రవంతి ద్వారా ఈ పురస్కారాన్ని పొందినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. స్షూర్తి స్వచ్ఛంధ సంస్థ ద్వారా ముందుముందు మరిన్ని చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు. కళా స్రవంతి వ్యవస్థాపక అధ్యక్షులు కొట్టె భాస్కర్ రావు మాట్లాడుతూ గత 5 సంవత్సరాల నుంచి సీనియర్ సిటిజన్ డే నాడు సన్మాన కార్య్రక్రమాలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ కళలకు, నాటక రంగానికి, సంగీత రంగానికి ప్రభావం చేస్తూ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సేవా అవార్డు గ్రహీత ముదుగంటి సుధాకర్ రెడ్డి, రాగమంజరి కల్చరల్ అసోసియేషన్ అధ్యక్షులు వాల భద్రారావు, యునెస్కో, లిమ్కా అవార్డు గ్రహీత సత్యతిరునగరి, బొపు శ్రీహరి, రిటైర్డ్ ఐటిఐ ప్రిన్సిపాల్ రమణ, తంగెడ నవనీత రావు, విజయకుమార్, గాయకులు, ఎం వెంకట రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *