Breaking News

‘కే.శ్రీనివాస్’ పుస్తకాల సమీక్ష విజయవంతం

k-Srinivas-Editor.jpg-new-960x630

కరీంనగర్ ,ప్రతినిధి : కవులు, మేధావులు కలగలిసారు.. రచయితలు తమ ప్రసంగాలతో అదరగొట్టారు. ‘కొత్త వంతెన’‘జూన్ 2’‘అనేక సందర్భాలు’ పుస్తక పరిచయ సభను దిగ్విజయం చేశారు.

కరీంనగర్ ఫిలింభవన్ లో కవులు, మేధావులు, రచయితలందరూ కలిసి నిర్వహించిన ఆంధ్రజ్యోతి ఎడిటర్ కే.శ్రీనివాస్ గారి పుస్తక పరిచయ సభ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, పుస్తకాల రచయిత, ఆంధ్రజ్యోతి ఎడిటర్ కే.శ్రీనివాస్ గారు, రచయితలు అన్నవరం దేవెందర్, గాజోజు నాగభూషణం తదితరులు హాజరై పుస్తక సమీక్ష నిర్వహించారు.

అన్నవరం దేవెందర్ గారు ‘జూన్2’ పుస్తకంపై సమీక్ష నిర్వహించారు. ఆద్యంతం చణుకులు విసురుతూ పుస్తకంలోని విభన్నమైన వ్యాసాలు, తెలంగాణ నేపథ్యం, సకలజనుల సమ్మెలో విగ్రహాల ధ్వంసం తదితర శ్రీనివాస్ గారు రచించిన వ్యాసాలపై సందర్భోచితంగా వివరించారు.

పుస్తక సమీక్ష అనంతరం వేదికపైనున్న అతిథులు పుస్తకాల్లోని వ్యాసాలు, కే.శ్రీనివాస్ రచనల గురించి అద్భుతంగా మాట్లాడారు. చివరగా ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, ఎడిటర్ కే.శ్రీనివాస్ గారు ముగింపు సందేశం ఇచ్చారు.

కార్యక్రమంలో ఆంధ్రజ్యోతి కరీంనగర్ బ్యూరో నగునూరి శేఖర్, సీనియర్ జర్నలిస్ట్ అయిలు రమేశ్, ఆంధ్రజ్యోతి పాత్రికేయులు, వివిధ రంగాల ప్రముఖులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *