Breaking News

కేసు పెట్టిందని భార్యపై కక్ష తీర్చుకున్న భర్త

call girl website

– కాల్ గర్ల్స్ సైట్ లో భార్య ఫొటో, ఫోన్ నంబర్ పెట్టి అవమానించిన భర్త
హైదరాబాద్, ప్రతినిధి : సంసారం కలతలతో భార్యను బజారు కీడ్చారు ఓ భర్త. పైళ్లైన ఏడాదికి కలతలు రాగా అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడంటూ భార్య సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అయిన భర్తపై కేసు పెట్టింది. దీంతో ఈ కేసు పెట్టిందని కక్ష పెట్టుకున్న భర్త భార్య కాల్ గర్ల్ అంటూ ఆమె ఫొటోను, నెంబర్ ను వెబ్ సైట్ లో పెట్టాడు. దీంతో ఆమె వందల ఫోన్లు రాగా భర్తపై కేసు పెట్టింది భార్య. ఈ ఉదంతం హైదరాబాద్ లో వెలుగుచూసింది.

హైదరాబాద్ లోని సైదాబాద్ లో నివాసముంటున్న భాగ్యలక్ష్మి-మురళీ కృష్ణ ఇద్దరూ సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు. నాలుగేల్ల కింద వివాహం జరిగింది. ఏడాది తర్వాత కలతలు రాగా అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడంటూ భాగ్యలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు విచారణలో ఉండగానే భార్యపై కోపంతో భర్త మురళీ కృష్ణ భార్యపై వ్యభిచారిగా ముద్రవేసి.. కాల్ గర్ల్స్ వెబ్ సైట్ లో ఆమె ఫొటో, ఫోన్ నంబర్ పెట్టాడు. దీంతో వందలాది ఫోన్లు రాగా ఆమె దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *