కేసుల నుంచి తప్పించేందుకే బాబు అలా చేశాడు..

హైదరాబాద్ : ఐదుకోట్ల ప్రజలు, నిరుద్యోగులు, విద్యార్థుల ఆశలపై చంద్రబాబు నాయుడు నీళ్లు చల్లారని.. ఇదంతా చేసింది ఓటుకు నోటు కేసులో నుంచి బయటపడేందుకేనని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. శంకుస్థాపనకు వచ్చిన ప్రధాని ప్రత్యేక హోదాపై ప్రకటన చేస్తారని ప్రజలంతా ఆశించారని.. కానీ మోదీ వచ్చారు, పార్లమెంటు నుంచి మట్టిని తెచ్చారు. యుమునా నీళ్లు తెచ్చారని కానీ హోదా విషయంపై రాష్ట్రాన్ని విడగొడుతూ ఇచ్చిన మాట మాత్రం మరిచిపోయారని తెలిపారు.

ప్రధాని నుంచి హామీలేవి రాలేవని.. తన కేసుల నుంచి బయటపడేందుకే ప్రత్యేక హోదాను చంద్రబాబు నాయుడు అమ్మేశఆరని చెప్పారు. దీనికి నిరసనగా రేపు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు తెలుపాలని జగన్ సూచించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *