Breaking News

కేసుల దర్యాప్తులను వేగవంతం చేయాలి

కేసుల దర్యాప్తులను వేగవంతం చేయాలి

కేసుల దర్యాప్తులను వేగవంతం చేయాలని నూతనంగా బాధ్యతలు చేపట్టిన నార్త్ జోన్ ఐజిపి వై.నాగిరెడ్డి అన్నారు. కేసుల దర్యాప్తుల్లో అలసత్వం ప్రదర్శించే వారిపై శాఖాపరంగా చర్యలు తప్పవని హెచ్చరించారు. నార్త్ జోన్ ఐజిపిగా బాద్యతలు స్వీకరించిన సందర్భంగా బుధవారం నాడు జిల్లా పోలీస్ హెడ్ క్వాటర్స్ ను సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రతి పోలీసు క్రమశిక్షణ తో మెదులుతూ పోలీస్ శాఖ ప్రతిష్టను పెంపొందించేందుకు కృషి చేయాలని చెప్పారు. రద్దీగా ఉండే ప్రాంతాల్లో విజుబుల్ పోలన్ విధానాన్ని అమలు చేయాలని అదేశించారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించే పోలీసులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లా ఎస్.పి డి.జోయల్ డేవిస్ జిల్లాలో నేరాల వివరాలు, నేరాల నియంత్రణకు తీసుకుంటున్న వివరాలను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్.పి టి. అన్నపూర్ణ, గోదావరి ఖని ఎ.ఎస్.పి విష్ణు, ఎస్.వారియర్, రాజేంద్రప్రసాద్, రవీందర్ రెడ్డి, మల్లారెడ్డి, సుధాకర్, జె.రామారావు ఎస్.బి డి.ఎస్.పి ప్రభాకర్ రావు, ఎస్.బి.ఐ సతీష్ చందర్ రావు తదితరులుపాల్గొన్నారు. ఎల్.యం.డి పోలీస్ తనిఖి: నూతనంగా నార్త్ జోన్ ఐజిగా బాధ్యతలు స్వీకరించిన ఐజి వై.నాగిరెడ్డి తొలుత ఎల్.యం.డి పోలీస్ స్టేషన్ ను తనిఖి చేశారు. ఈ సందర్భంగా స్టేషన్ రికార్డులను పరిశీలించడంతో పాటు సబ్-డివిజన్ అధికారులతో సమావేశమై కేసుల వివరాలను తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాలను తనిఖిచేశారు. ప్రతి పోలీసు క్రమశిక్షణతో విధులను నిర్వర్తించాలని సూచించారు.

igp nagireddy

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *