Breaking News

కేసీఆర్ హామీ నెరవేరింది..

konda2

వరంగల్ : 2014 ఎన్నికల్లో గెలువగానే వరంగల్ జిల్లా తూర్పు నియోజకవర్గం నుంచి గెలిచిన కొండా సురేఖను మంత్రివర్గంలోకి తీసుకొని మంత్రి పదవి ఇస్తారని అందరూ అనుకున్నారు. కానీ అలా జరగలేదు..కేసీఆర్ కొండా సురేఖకు హామీ ఇచ్చినా సామాజిక, ఉద్యమ నేపథ్యం , జిల్లా సమీకరణాలతో ఆమెకు మంత్రి పదవి లభించలేదు. దీంతో కేసీఆర్ భవిష్యత్తులో కొండా మురళికి ఎమ్మెల్సీ ఇస్తానని వాగ్ధానం చేశారు. ఇప్పుడది నెరవేర్చారు కేసీఆర్..

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వరంగల్ జిల్లా నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా కొండా మురళిని ఖరారు చేస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈరోజు ఆయన వరంగల్ లో ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నారు. దీంతో సీఎం కేసీఆర్ కొండా ఫ్యామిలీకి ఇచ్చిన హామీని ఎట్టకేలకు నెరవేర్చారు. భవిష్యత్తులో జిల్లా సమీకరణాలు, మంత్రి పదవులు పునర్వ్యస్థీకరణలో కొండా సురేఖకు మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉంటుంది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *