
సీఎం కేసీఆర్ తెలంగాణ ఏర్పాటుకు ముందు జరిగిన ఓ కుట్రను ఈరోజు బయటపెట్టాడు.. ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి, మాజీ ఎంపీ వివేక్, మాజీ మంత్రి వినోద్ , ఎమ్మెల్యేలు భాస్కర్ రావు, రాంచంద్ర నాయక్ లు బుధవారం హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ వారికి కండువాలు కప్పి కాంగ్రెస్, టీడీపీలు తెలంగాణ ఏర్పాటు కాకుండా చేసిన కుట్రను బయటపెట్టాడు..
తెలంగాణ ఏర్పడకముందు ఎన్నికల ఫలితాల అనంతరం టీఆర్ఎస్ 63 సీట్లు సాధించిందని.. ఎలాగైనా టీఆర్ఎస్ తెలంగాణ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకుండా కాంగ్రెస్, టీడీపీ లు కలిసి కూల్చేసి రాష్ట్రపతి పాలన పెట్టేలా కుట్రపన్నాయని కేసీఆర్ ఆరోపించారు. ఈ విషయాన్ని స్వయంగా ఇంటికి వచ్చి మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ తనకు చెప్పారని కేసీఆర్ వివరించారు..
ఓవైసీ ‘ఏం న్యాయం సార్.. ఇది రాష్ట్ర మనది.. బతుకనీయ్యరా మనల్ని.. వీళ్లు.. మీతో పాటు భుజం కలిపి నేనుంటా.. మజ్లిస్ పార్టీ టీఆర్ఎస్ కు మద్దతు ప్రకటిస్తది.. అని ’ ఓవైసీ తనకు అండగా నిలిచారని కేసీఆర్ గుర్తుచేశారు. అనంతరం మజ్లిస్ పార్టీ టీఆర్ఎస్ కు మద్దతుగా తీర్మానించిందన్నారు.
కాంగ్రెస్ ,టీడీపీలు కలిసి అయినా టీఆర్ఎస్ ను కూల్చేయాలని యోచించాయని.. ఆ కుట్రదారులను ఎలాగైనా నామరూపల్లేకుండా చేస్తామని కేసీఆర్ హెచ్చరించారు.. దీంతో కాంగ్రెస్, టీడీపీ కుట్రలు బయటపడ్డినట్టైంది.