కేసీఆర్ సర్కారుకు శ్రావణ్ షాక్

ప్రభుత్వం విడుదల చేసే జీవోలు ఇన్నాళ్లు వెబ్ సైట్ లో ఉండేవి. దీనివల్ల ప్రజలకు, నాయకులకు ప్రభుత్వం ఎన్ని నిధులు ఖర్చు చేసింది.. ఏఏ పనులకు ఎన్ని కేటాయించింది.. ప్రాజెక్టులకు, పనులకు ఎంత మొత్తం వెచ్చించేది చాలా పారదర్శకంగా వెబ్ సైట్ లో కనిపించేంది.. దీనివల్ల ప్రతిపక్షాలు, ప్రజలకు ప్రభుత్వం చేస్తున్న ఖర్చు , సద్వినియోగం అవుతున్నాయా.. దుబారా చేస్తున్నారా తెలిసేది..

కానీ తెలంగాణ ప్రభుత్వం ఈ నియమాలను పక్కనపెట్టింది. తమ ప్రభుత్వం పెడుతున్న ఖర్చు లూప్ హోల్స్ అందరికీ తెలిస్తే తమను ఇరుకున పెడతారని.. వెబ్ సైట్ ను ఆపేసింది. దీంతో ప్రభుత్వ ఖర్చు నిధులు వినియోగం ఎవరికీ తెలియడం లేదు..

దీనిపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి శ్రావణ్ హైకోర్టును ఆశ్రయించారు. తెలంగాణ ప్రభుత్వం జీవో ల వెబ్ సైట్ నిలిపివేసి సమాచారహక్కు చట్టం, పారదర్శకత పాలనకు పడకేసి నిధులు దుబారా చేస్తోందని హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి అల్టీమేటం జారీ చేసింది. జీవోల వెబ్ సైట్ వెంటనే పునరిద్దరించాలని స్పష్టం చేశారు. శ్రావణ్ చేసిన పని వల్ల మళ్లీ తెలంగాణ ప్రభుత్వం జీవోల వెబ్ సైట్ ను స్టార్ట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *