కేసీఆర్ సంకల్పానికి తగ్గట్టుగానే మిషన్ భగీరథ పనులు….

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు గారి సంకల్పానికి తగ్గట్టుగానే మిషన్ భగీరథ పనులు సాగుతున్నాయన్నారు వైస్ ఛైర్మెన్ వేముల ప్రశాంత్ రెడ్డి.దశాబ్దాలుగా గుక్కెడు మంచినీళ్లకు కూడా నోచుకుని తెలంగాణ గడ్డను త్వరలోనే కృష్ణా, గోదారమ్మ జలాలతో సిఎం కేసీఆర్ అభిషేకించబోతున్నారని చెప్పారు. మిషన్ భగీరథ పనుల పురోగతిపై సచివాలయంలోని తన కార్యాలయంలో ఇవాళ సమీక్షా సమావేశం నిర్వహించిన ప్రశాంత్ రెడ్డి, ముఖ్యమంత్రి గారి మార్గనిర్దేశనంలో ఈ సంవత్సరం డిసెంబర్ నాటికే రాష్ట్రంలోని ప్రతీ ఆవాసానికి సురక్షిత మంచినీటిని అందించాలన్నారు. ఇందుకోసం ప్రతీ నియోజకవర్గంలోని ఒక్కో మండలంలో అంతర్గత పైప్ లైన్ పనులు [intra village works] వెంటనే ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. దీనికి సంబంధించిన సమగ్ర యాక్షన్ ప్లాన్ ను రూపొందించాలన్నారు. మరో వారంలో వర్కింగ్ ఎస్టిమేట్స్ పూర్తి కావాల్సిందే అన్నారు. మార్చ్ చివరి నాటికి అన్నీ ఇంటెక్ వెల్స్ ను పూర్తి స్థాయిలో సిద్ధం చేయాలని సూచించారు. కీలకమైన వాటర్ ట్రీట్ మెంట్ ప్లాంట్ పనులను జూన్ నాటికి పూర్తి చేయడానికి కావాల్సిన అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. వర్కింగ్ ఏజెన్సీలతో మాట్లాడి వర్క్ ఫోర్స్ ను పెంచేలా చూడాలన్నారు. ఇక నుంచి పైప్ లైన్ పనులకు సంబంధించిన డైలీ ప్రోగ్రెస్ ను తన ఆఫీసుకు పంపించాలన్న ప్రశాంత్ రెడ్డి, వారానికి ఒకసారి పైప్ లైన్ పనులను తాను సమీక్షిస్తానని చెప్పారు. జిల్లాల వారీగా పైప్ లైన్ పనులు త్వరగా పూర్తి కావడానికి కన్సల్టెంట్లు తగు సూచనలు ఇవ్వాలని కోరారు. ముఖ్యంగా ఎక్కడైనా వ్యవసాయ భూముల్లో పైప్ లైన్ పనులు ఇంకా పూర్తి కాకుంటే, దానిపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. వ్యవసాయ భూముల్లో పైప్ లైన్ పనులకు సంబంధించి వారానికి ఒకసారి తనకు నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. కచ్చితమైన ప్లానింగ్, సమగ్ర కార్యచరణతో ఈ సంవత్సరం డిసెంబర్ నాటికి రాష్ట్రంలోని ప్రతీ ఆవాసానికి సురక్షిత మంచినీటిని అందించాలని వేముల ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ సమీక్షా సమావేశంలో RWS&S ఈ.ఎన్.సి సురేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు జ్ఞానేశ్వర్, మిషన్ భగీరథ చీఫ్ ఇంజనీర్లు సురేష్ కుమార్, కృపాకర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, విజయపాల్ రెడ్డి,OSD సత్యపాల్ రెడ్డి, కన్సల్టెంట్లు నర్సింగరావు, మనోహర్ బాబు, జగన్, శ్రీనివాస్ రెడ్డి తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *