కేసీఆర్ ‘వాస్తు’ గోల..

KCR_vaastu gola

హైదరాబాద్ , ప్రతినిధి : తెలంగాణ సీఎం కేసీఆర్ వాస్తు నమ్మకం రాష్ట్ర రాజకీయాల్లో గోల గోల రేపుతోంది. దీనిపై కాంగ్రెస్, టీడీపీ నాయకులు విమర్శలు చేస్తున్నారు. ‘వాస్తు నమ్మకం’ తెలంగాణ ప్రభుత్వంలో ఎన్ని మార్పులకు కారణమవుతోంది. 50 ఏళ్ల సచివాలయాన్ని ఎర్రగడ్డ పిచ్చాసుపత్రికి తరలిస్తోంది. 100 ఏళ్ల ఎర్రగడ్డ పిచ్చాసుపత్రిని వికారాబాద్ అడువులకు తరలిస్తోంది. ఇదంతా తెలంగాణ సీఎంగారి వాస్తు నమ్మకం.. ఆ నమ్మకమే ఇప్పుడు తెలంగాణ ప్రజల పాలిట సమస్యలు సృష్టిస్తోంది.

పక్క సీఎం చంద్రబాబు ఏం చేస్తున్నారు..? గత ప్రభుత్వాలు అమలు చేసిన వ్యవస్థలను.. పద్ధతులను ప్రజలకు చేటు తేవకుండా కొంచెం మార్చి అభివృద్ధి చేస్తున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఏం చేస్తున్నారు.? ఉన్న తెలంగాణను పునర్నిర్మించకుండా కూలగొట్టి మళ్లీ నిర్మిస్తాడట.. చంద్రబాబు చేసే పనివల్ల ప్రజలు పురోగతి సాధిస్తారు. కేసీఆర్ నిర్ణయాల వల్ల వేల కోట్ల ప్రజాధనం వృథా అయి ప్రజలపైనే భారం పడుతోంది.

60 ఏళ్ల పాలన సాగిన సచివాలయంలో కేసీఆర్ కంటే మహామహులైన సీఎంలు పాలన కొనసాగించారు. వారందరికీ పేరొచ్చింది. పనులు చేశారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారు. వారికి లేని వాస్తు, నమ్మకం కేసీఆర్ కే ఎందుకొచ్చింది. అన్నీ బాగాలేవంటూ కొత్తవి నిర్మిస్తూ పోతే ఎంత డబ్బు వేస్టు.. ఎంత సమయం వృథా. . దీనివల్ల ఎంతమందికి ఇబ్బందులు.. ఇవన్నీ పట్టని సీఎం కేసీఆర్ వాస్తు పేర చేస్తున్న ఈ తతంగం ప్రజల పాలిట శాపంగా మారుతోంది. ఆయనకు చెప్పే వారు లేరు.. చెప్పిన వినేరకం కాదు.. దీంతో ఈ వాస్తు గోల జనాలు తప్పేట్టు లేదు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *