Breaking News

కేసీఆర్.. రాజయ్యను బలిపశువును చేస్తున్నారు?

KCR-IsRevanth-Reddy-02

హైదరాబాద్, ప్రతినిధి : కేసీఆర్ దళితులను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నాడని.. అందుకే రాజయ్యపై ఆరోపణలతో మంత్రిపదవిని తీసేయాలని చూస్తున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఆదివారం ఆయన హైదరాబాద్ లో విలేకరులతో మాట్లాడుతూ  అవినీతిపై కేసీఆర్ ఒక నీతి, రాజయ్య కు ఒక నీతా అని ప్రశ్నించారు. కేసీఆర్ తన కుటుంబ సభ్యులపై వస్తున్న ఆరోపణలపై ఎందుకు మాట్లాడడం లేదని మండిపడ్డారు. స్వైన్ ఫ్లూ విషయంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా రాజయ్యకు, మున్సిపల్ శాఖ చూస్తున్న కేసీఆర్ కు సమాన భాగస్వామ్యం ఉందని.. రాజయ్యను తీసేస్తే.. కేసీఆర్ కూడా వైదొలగాలని స్పష్టం చేశారు. కేసీఆర్ తన అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు రాజయ్యను బలిపశువు చేస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *