Breaking News

కేసీఆర్ మొక్కులకు నిధులు విడుదల

kcr copy

హైదరాబాద్, ప్రతినిధి : తెలంగాణ అమరులకు ఇవ్వడానికి మీనమేషాలు లెక్కిస్తారు.. పింఛన్ల కోసం జనం రోడ్డెక్కుతున్న పైసా విదిల్చరూ.. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న కనీసం సాయం చేయరూ.. జర్నలిస్టులు తమకు హెల్త్ కార్డులు, అక్రిడేషన్లంటూ గొంతు చిక్కుకున్నా లెక్కలేదు.. కానీ ఆయన మొక్కులకు మాత్రం ఠంచనుగా కోట్లకు కోట్లు మంజూరు చేయించుకున్నారు. ఇదీ ఘనత వహించిన సీఎం కేసీఆర్ పాలనానీతి..

సీఎం కేసీఆర్ తాను ఉద్యమ సమయంలో తెలంగాణ ఏర్పడడానికి మొక్కిన మొక్కుల చెల్లింపునకు ప్రభుత్వ ఖాజానా నుంచి నిధులు మంజూరు చేయించుకున్నారు. దీనికోసం జీవో మంగళవారం జారీ అయ్యింది.
1. తిరుమల శ్రీవారి ఆభరణాల కోసం రూ.5 కోట్లు
2.భద్రకాళి అమ్మవారికి 2 కిలోల బంగారు కిరీటం, ముక్కుపుడక కోసం రూ.57లక్షలు
3. తిరుచానూరు పద్మావతి అమ్మవారికి 15 గ్రాముల ముక్కుపుడుక కోసం రూ.45 లక్షలు
4.విజయవాడ కనకదుర్గ అమ్మవారి ముక్కపుడక కోసం రూ.45 వేలు..
5. మెదక్ వీరభద్రస్వామి 25 గ్రాముల బంగారు మీసాల కోసం రూ.75 వేలు..

ఇలా ప్రజల సొమ్మును దేవుళ్ల కోసం ఖర్చు చేస్తున్నారు సీఎం కేసీఆర్. తాను మొక్కిన మొక్కులకు ఆయన సొంత డబ్బు వెచ్చించాల్సి ఉండగా.. ప్రజల సొమ్మును పప్పు బెల్లాల్లా పంచిపెట్టడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.. ఆయన మొక్కిన మొక్కులకు కరుణించి సీఎం పోస్టు దక్కింది. దానికి ఆయన పార్టీ నుంచి కానీ.. సొంతంగా నీ మొక్కులు చెల్లించాలి.. కానీ ఇలా ప్రభుత్వం పరంగా డబ్బులు విడుదల చేయడం విమర్శలకు దారితీస్తోంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *