
తెరమీద చిందులేసే వారికంటే పొలిటికల్ హీరోలే ఎక్కు పాపులారిటీ పొందిన అరుదైన సందర్భాలు కొన్ని ఉంటాయి. ఇప్పుడు కేసీఆర్ విషయంలో అదే జరిగింది. సి ఎన్ ఎన్ ఐ బి ఎన్ చానల్ నిర్వహిస్తున్న ఇండియన్ ఆఫ్ ది ఇయర్ పాపులర్ చాయిస్ ఒపీనియన్ పోల్ లో కేసీఆర్ ప్రస్తుతం రెండో స్థానంలో ఉన్నారు. దేశ వ్యాప్తంగానే కాదు, ప్రపంచ వ్యాప్తంగా చాలా మందికి తెలిసిన వాడు, ఫ్యాన్స్ ఉన్న వాడు అయిన ఆమిర్ ఖాన్ మూడో స్థానంలో ఉన్నాడు.
పది జిల్లాల తెలంగాణ ముఖ్యమంత్రి అయిన కేసీఆర్, పాపులారిటీలో ఆమిర్ ఖాన్ ను వెనక్కి నెట్టడం సంచలనమే. తెలంగాణ వ్యాప్తంగా ఆయన ఎంతో ప్రాచుర్యం ఉన్నావారు. అయితే దేశ వ్యాప్తంగా ఆమిర్ ఖాన్ చాలా మందికి తెలుసు. ఎంతో మంది అభిమానులు కూడా ఉన్నారు. అలాంటి వాడు కేసీఆర్ కంటే వెనకబడి పోవడం ఆశ్చర్యకరం. ఫేస్ బుక్ లోనూ కేసీఆర్ కంటే ఆమిర్ కే ఎక్కువ లైక్ లున్నాయి. కానీ ఓవరాల్ గా తెలంగాణ హీరోనే ముందున్నారు. ఇక, ఈ పోల్ లో నాలుగో స్తానంలో ఆర్మీ, విపత్తుల నివారణ సంస్థఉమ్మడిగా ఉన్నాయి. కాశ్మీర్ వరదల్లో ఇవి ఎంతో సేవ చేశాయి. ఇక మైక్రోసాఫ్ట్ సి ఇ ఒ సత్య నాదెళ్ల ఐదో స్థానంలో ఉన్నారు.
కేరళ ఇంటెలిజెన్స్ డిప్యుటి ఐజి విజయన్ ఈ రేసులో ముందున్నారు. మొత్తానికి, ఆమిర్ కంటే కేసీఆర్ కు 18 శాతం ఎక్కువ ఓట్లు రావడమే ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. దేశ వ్యాప్తంగా 35 మంది నామినీల్లోంచి ఆరు విభాగాల్లో ఇండియన్ ఆఫ్ ది ఇయర్ ఎంపిక జరుగుతుంది.