
-మూడు నిమిషాల ప్రసంగానికే ఏపీ జనం నీరాజనం
అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి హాజరైన సీఎం కేసీఆర్ కు ప్రసంగించే షెడ్యూల్ లో లేదు.. కానీ జనం కేసీఆర్ అంటూ కేకలు వేయడంతో 3 నిమిషాల సమయం కేటాయించారు. దీంతో లేచి మాట్లాడిన కేసీఆర్ పెద్దలందరి పేర్లు ప్రముఖంగా చెప్పి విజయదశమి శుభాకాంక్షలు చెప్పారు.
విజయదశమి రోజున అమరావతి శంకుస్థాపన జరగడం సంతోషదాయకం అని ఏపీ ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాల సహాయసహకారాలు అందిస్తుందని క్లుప్తంగా చెప్పి ముగించారు.
వేదికపై కేసీఆర్ మాట్లాడతారనగానే జనం కేరింతలు కొట్టి చప్పట్లతో స్వాగతం పలకడం విశేషం..