కేసీఆర్ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చారు

కేసీఆర్ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చారు

పాలకుర్తి టీఆర్ఎస్ ఎమ్మెల్కే అభ్యర్థి ఎర్రబెల్లి
సీఎం కేసీఆర్ బడుగు, బలహీన వర్గాల ప్రజల ఆకాంక్షలు నెరవేర్చారని, ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని పాలకుర్తి ఎమ్మెల్యే అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్ రావు కోరారు. వరంగల్ రూరల్ రాయపర్తి మండలం కొలన్ పల్లి గ్రామం ముదిరాజ్ సంఘం సభ్యలు మొత్తం టీఆర్ఎస్ కు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి మరోసారి పట్టం కట్టాలన్నారు. అన్ని వర్గాలకు న్యాయం చేయాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని, అందులో భాగంగానే అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టారని తెలిపారు. నాలుగున్నరేళ్లలో టీఆర్ఎస్ పాలనలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదన్నారు. గతంలో ఏ ప్రభుత్వాలు చేయలేని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్టు చెప్పారు. నిరుపేద కుటుంబాల్లోని ఆడ పిల్లల పెళ్లిల్లకు రూ. లక్ష ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కిందన్నారు. ప్రభుత్వం అమలు చేసిన సంక్షమ పథకాలు మళ్లీ గెలిపిస్తాయని, గ్రామాల్లో ప్రజలు టీఆర్ఎస్ కు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. అంతకుముందు ఎర్రబెల్లికి మద్దతు తెలిపిన వారిలో మిట్టపల్లి వెంకట్రావు, శ్రీనివాస్, కొమురయ్య, గోపాల్, నాగరాజు, సైదుల్, ఉప్పలయ్య, రమేష్, యాకయ్య, నర్సయ్య, రాజు, ప్రవీణ్ తదితరులు ఉన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *