Breaking News

కేసీఆర్ ప్రకటించారు మరో వరం

01234

తెలంగాణ ప్రజలపై కేసీఆర్ మరో వరం కురిపించారు. మార్చి నుంచి అందరికీ కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ పథకం వర్తింపచేస్తున్నట్టు ప్రకటించారు.  వరంగల్ వేదికగా సీఎం కేసీఆర్  వచ్చే మార్చి నెల నుంచి తెలంగాణలో రేషన్ కార్డు ఉన్న ప్రతీ ఒక్కరికి కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ వర్తింప చేయనున్నట్టు హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. వరంగల్ లోని కేటీపీపీ రెండో దశ 600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభోత్సవం చేసిన కేసీఆర్ అనంతరం సభలో మాట్లాడారు.. రోబోయే ఖరీఫ్ నుంచి సేద్యానికి పగటి పూటే 9 గంటల విద్యుత్ సరఫరా చేస్తామని ప్రకటించారు. 24 గంటల పాటు విద్యుత్ సరఫరా దిశగా తెలంగాణ వెళ్తుందని , 2018 వరకు ఆ లక్ష్యం సాధిస్తామన్నారు.

అనంతరం మిషన్ భగీరత, మిషన్ కాకతీయ, భారీ నీటిపారుదల ప్రాజెక్టులపై వరంగల్ సీఎం కేసీఆర్ స్పందించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసి తెలంగాణ కరువు తీరుస్తామన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *