
సీఎం కేసీఆర్ సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ టీఎస్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ప్రశంసలు కురిపించారు. హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్ లో న్యాయమూర్తుల న్యాయాధికార సదస్సు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాుట చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. సీఎం కేసీఆర్ గొప్ప విజన్, కమిట్ మెంట్ ఉన్న నేత అని కొనియాడారు.
సొంత రాష్ట్రంలో నిర్వహిస్తోన్న న్యాయసేవా సదస్సులో పాల్గొనడం సంతోషంగా ఉందని జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు.. ఈ సందర్భంగా సుప్రీం చీఫ్ జస్టిస్ మాట్లాడుతూ తెలంగాణ సీఎం దేశంలోనే అనేక పథకాలతో ప్రజల అభివృద్దికి కృషి దేశవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు పొందాడన్నారు. అనంతరం తెలంగాణ లీగల్ సర్వీసెస్ అథారిటీ వెబ్ సైట్ ను ప్రారంభించారు.