కేసీఆర్ పై మరో బాంబు రెడీ చేస్తున్న రాధాకృష్ణ

హైదరాబాద్ : కేసీఆర్, ఆంధ్రజ్యోతి మీడియా ఎండీ రాధాకృష్ణ ల వైరం ముదిరి పాకాన పడుతోంది. ఈ ఆదివారం ఆంధ్రజ్యోతి ప్రధాన సంచికలో ప్రచురితమైన కొత్తపలుకు శీర్షికలో ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ సంచలన విషయాన్ని వెల్లడిస్తానని చెప్పడం సర్వత్రా ఆసక్తి రేపుతోంది.

కేసీఆర్ అధికారంలోకి రాగానే ఆంధ్రజ్యోతి ఏబీఎన్ చానల్ ను తెలంగాణ వ్యతిరేక వార్తలు రాసిందని తెలంగాణలో అనధికార బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే.. ఈ నేపథ్యంలో కేసీఆర్, టీఆర్ఎస్ పై రాధాకృష్ణ ఒంటికాలిపై లేస్తున్నాడు. చంద్రబాబు ప్రోద్బలంతో ఎక్కడ అవకాశం వచ్చినా తన పత్రిక, చానల్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నాడు. దీంతో కేసీఆర్ ఏకంగా ఆ ఏబీఎన్ చానల్ పైనే అనధికార నిషేధం అమలు చేస్తున్నారు.

ఇదంతా అటు ఉంచితిే.. ఆదివారం ఎడిటోరియల్ రాసిన రాధాకృష్ణ కేసీఆర్ తెలంగాణ కోసం చేసిన ఆమరణ దీక్షపై సంచలన వ్యాఖ్యలు చేశారు.‘ కేసీఆర్ దీక్ష కొనసాగించడం తన వల్లకాదని.. ఏం చేద్దామని తనను అడిగాడని.. ఆ దశలో ఏం  తనను ఏం కోరింది.. ఏం చేసింది.. ఇంతలో ఏమీ జరిగిందనే’ విషయాన్ని త్వరలో బయటపెడతానని బాంబు పేల్చాడు..

kcr radha krishna.jpg222

ఆయన వ్యాఖ్యలు ప్రకారం కేసీఆర్ అమరణ దీక్ష బూటకంలా.. ఏదో స్వార్థ ప్రయోజనాల కోసమే కేసీఆర్ దీక్ష చేసినట్టు దాన్ని బయటపెడతానంటూ పేర్కొనడం సంచలనం రేపుతోంది.  ఈ వైరం ఇంకా ఎక్కడికి దారితీస్తోందని.. పరీశీలకులు భావిస్తున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *