
సీఎం కేసీఆర్ మాటల మాంత్రికుడని మరోసారి నిరూపించుకున్నారు. ఆయనలా దేశంలో ప్రజల్ని ఆకట్టుకునేలా బహుశా ఎవరూ మాట్లాడరేమో.. గ్రామీణ నిరక్షరాస్యులకు సైతం అర్థమయ్యేలా చాలా విడమరిచి తెలంగాణ యాసలో ఇరగదీస్తుంటారాయన.. అలాగే గ్రామ జ్యోతి కార్యక్రమంలో భాగంగా వరంగల్ జిల్లాలో గంగదేవిపల్లి, మేడిపల్లిలో ఆయన మాట్లాడారు..
ఈ సందర్భంగా కేసీఆర్ చెప్పిన పిట్టకథ అందరి చేత నవ్వులు పూయించింది.. లంకలో శ్రీరాముడు చంపిన రాక్షసులు అడ్డం తిరిగితే శ్రీరాముడు వరం ఇచ్చాడని.. తెలంగాణలోని ప్రతీ ఊళ్లో నలుగురు చొప్పున పుట్టి.. గ్రామాల అభివృద్ది అడ్డుపడండని వరమిచ్చాడని చెప్పాడు. దీంతో మేడిపల్లి గ్రామస్థులందరూ పగలబడి నవ్వారు. గ్రామంలో పనులు అడ్డుకునే నలుగురు రాక్షసులు (ప్రతిపక్షాల వారు) ఉంటారని వారి మాట వినకుండా అభివృద్ది చేసుకోవాలని పిట్టకథ చెప్పి అలరించారు.