
గడిచిన సంవత్సరం.. జనవరి నుంచే కరెంట్ కోతలు మొదలయ్యాయి. మార్చి వచ్చే నాటికి పల్లెలకు పగటి పూట మొత్తం కరెంటు తీసేశారు.. పట్టణాలు, నగరాలకు, ఏకంగా రాజధాని హైదరాబాద్ లోనే 4 గంటలు కోత విధించారు. ఆ తర్వాత జూన్ 2 తెలంగాణ ఏర్పడింది. ఉమ్మడి రాష్ట్రం విడిపోయి తెలంగాణ ఏర్పడింది. ఏపీ సీఎం చంద్రబాబు ఏపీ విద్యుత్ కేంద్రాల నుంచి తెలంగాణకు కరెంట్ ఇవ్వకుండా మొండి కేశారు. అప్పుడే పగ్గాలు చేపట్టిన కేసీఆర్ ఈ కరెంటు కోతలను ఎద్కోరవడంలో ఘోరంగా విఫలమయ్యారు. రైతుల ఆత్మహత్యలు పెరిగిపోయాయి. చంద్రబాబు , ప్రతిపక్షాలు కేసీఆర్ ఫెయిల్ అయ్యాడంటూ విమర్శించారు. అక్కడికి ఆగితే..
పాలన పగ్గాలు చేపట్టిన మరుక్షణం ప్రక్షాళన ప్రారంభించారు కేసీఆర్.. విద్యుత్ సమస్యపై ఏపీసీఎం చంద్రబాబు వైఖరిపై మండిపడ్డారు. కరెంటు ఇవ్వని ఆంధ్రాసర్కారుకు బుద్ధి చెప్పాలని గట్టి నిర్ణయం తీసుకున్నారు. బయట మార్కెట్ లో కరెంటు లభ్యత పై ప్రతీసారీ ఉన్నతస్థాయి సమీక్షలు చేశారు. కేంద్రంతో కరెంటు సమస్యపై మాట్లాడి తెచ్చుకున్నారు. ఎక్కడ దొరికినా కరెంటు కొనేశారు. అధికారులను అలెర్ట్ చేశారు. కరెంటు పై కేసీఆర్ చూపిన ముందుచూపుతో ఇప్పుడు అదే మార్చిలో కరెంటు కోతలు లేవు.. ఎంతలా అంటే గ్రామాలకు కూడా 24 గంటలు సరఫరా అవుతోంది. అలాగే రైతులకు 6 గంటల కరెంటు పూర్తిస్థాయిలో అందుతోంది. పట్టుదల , శ్రమ చేస్తే ఎన్నికుట్రలు ఎదురైనా సాధించవచ్చని నిరూపించారు కేసీఆర్.
ఇప్పుడ ఏకంగా కేంద్ర ప్రభుత్వ ఆర్ఈసీ తెలంగాణలోని విద్యుత్ కేంద్రాల నిర్మాణం కోసం భారీగా రుణం మంజూరు చేసింది. ఏకంగా 24 వేల కోట్ల నిధులు విడుదలయ్యాయి.ఈ నిధులతో విద్యుత్ కేంద్రాలను నిర్మించి రాబోయే 3 ఏళ్లలో పూర్తి విద్యుత్ అంది తెలంగాణ సస్య శ్యామలం కానుంది.