Breaking News

కేసీఆర్ ను 2వ ప్లేస్ కు కొట్టిన టీడీపీ

kcr-2nd-place

-టీఎన్ఎస్ఎఫ్ ఎఫ్.బిలో విజయన్ కు ఓటేయాలని ఆదేశం.
-దీంతో 1st ప్లేస్ లో ఉన్న కేసీఆర్ రెండోస్థానంలోకి..
ఢిల్లీ, ప్రతినిధి : టీడీపీ సీఎం కేసీఆర్ ను దొంగదెబ్బ తీసింది. నారాలోకేష్ సారథ్యంలో పనిచేసిన టీఎన్ఎస్ఎఫ్ పక్కా వ్యూహంతో చివరిరోజు అంచనాలతో తలకిందులు చేసింది. పోల్ మొదలైనప్పటినుంచి మొదటిస్థానంలో ఉన్న కేసీఆర్ చివరిరోజు అనూహ్యంగా రెండోస్థానానికి పడిపోయారు. ఇదంతా టీడీపీ కేసీఆర్ కు మొదటి ర్యాంకు రావద్దని చేసిన కుట్ర.

ప్రతిష్టాత్మక సీఎన్ఎన్ ఐబీఎన్ ప్రతీ సంవత్సరం అందించే ఇండియన్ ఆఫ్ ది ఇయర్ పోటీలో సీఎం కేసీఆర్ జనవరి 30 వరకు కూడా మొదటిస్థానంలో ఉన్నారు. ఆయనకే ఇండియన్ ఆఫ్ ది ఇయర్ వస్తుందని ఆశించారు. కానీ జనవరి 31 చివరి రోజు టీడీపీ మైండ్ గేమ్ ఆడింది. ఏపీలోని తన కార్యకర్తలకు టీఎన్ఎస్ఎఫ్ ట్విట్లర్, ఫేస్ బుక్ ద్వారా 2వస్తానంలో ఉన్న విజయన్ కు ఓటు వేయాలని సూచించింది. దీంతో మొదటిస్థానంలో ఉన్న కేసీఆర్ రెండోస్థానంలోకి పడిపోగా.. రెండోస్థానంలో ఉన్న విజయన్ మొదటిస్థానం పొందారు.

కాగా కేసీఆర్ పై ఉన్న కోపంతో మైండ్ గేమ్ ఆడిన టీడీపీ మొత్తానికి కేసీఆర్ ను రెండోస్థానానికి పడగొట్టిన ఓవరాల్ గా పొలిటీషియన్స్ లో మాత్రం ఉద్దండులను పక్కనపెట్టి కేసీఆర్ మొదటిస్థానంలో నిలిచారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *