కేసీఆర్ ను విలన్ ని చేసిన ఆంధ్రా మీడియా

0bahubali kcr

బాహుబలి సినిమా స్ఫూర్తితో తీసిన ఓ కార్టూన్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది. పక్కా ఆంధ్రా పక్షపాతంతో తీసిన ఈ వీడియో ఆంధ్రాబలిలో చంద్రబాబును హీరోను చేసి.. కేసీఆర్ ను విలన్ ను చేసింది.. సోనియాను శివగామిగా.. దిగ్విజయ్ సింగ్ ను బిజ్జల దేవగా.. గిరిజన విలన్ కాలకేయగా జగన్ ను కట్టప్పగా మాజీ సీఎం కిరణ్ ను పెట్టి తీసిన వీడియో వివాదాలకు దారి తీస్తోంది..

కేసీఆర్ ఈ వీడియోలో భల్లాల దేవగా చూపించారు. ఆంధ్రా నుంచి హైదరాబాద్ ను దక్కించుకునేందుకు కుట్రలు కుతంత్రాలు చేశాడని విమర్శించారు. కేసీఆర్ ను పక్కా అవకాశవాదిగి చూపిస్తూ చంద్రబాబును హీరోగా వర్ణించిన అసభ్య పదజాలతో దూషించారు.

ఇప్పుడు ఇది చాలా వివాదాలకు దారితీస్తోంది. ఆంధ్రామీడియా తీరుపై తెలంగాణ వాదులు మండిపడుతున్నారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ఇంకా తెలంగాణ ఆ ఏడుపు ఏమిటని సదురు వీడియో ప్రశ్నల వర్షం కురిపించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *