కేసీఆర్ ను మించిపోతున్న ‘ముద్రగడ’

31-1454223538-mudragada-kapu-garjana-666

కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని తీరాలకు చేర్చి స్వరాష్ట్ర సాధనకు మార్గ సుగమం చేసిన నేత.. దాదాపు తెలంగాణ ఉద్యమం శాంతియుతంగానే జరిగింది. చిన్న చిన్న ఘటనలు తప్ప పెద్దగా హింస జరిగింది లేదు.. బంద్ లు, హర్తాళ్లు జరిగాయి.. కానీ ఇప్పుడు ఏపీలో జరుగుతున్న మరో ఉద్యమం తెలంగాణ ఉద్యమాన్ని మించి ఉద్రిక్తతలకు దారితీసింది.. ఏపీ కేసీఆర్ లా పేరు తెచ్చుకున్న మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఆధ్వర్యంలో కొనసాగుతున్న కాపుల హక్కుల సాధన ఉద్యమం కంప్లీట్ గా పక్కదారిలో నడుస్తోంది. ఇక్కడ కేసీఆర్ శాంతియుత నిరసనలకు పిలుపునిచ్చేవాడు. కడుపు కాలిన ఉద్యమకారులు కాసింత ఆందోళన చేసినా పోలీసులు అణిచివేసే వారు.. కానీ ఇప్పుడు ఏపీలో కాపు ఉద్యమాకారులను స్వయంగా ముద్రగడే ఉసిగొల్పారు.. తమ హక్కుల కోసం జాతీయరహదారి, రైల్వే పట్టాలపై భైటాయించి అక్కడే నిరసన తెలుపుదాం అంటూ ఉద్యమాన్ని రోడ్డున పడేశారు.. ఇంత అవేశపూరితంగా చేస్తున్న ఉద్యమం వల్ల ప్రజలకు ఇబ్బందులు, ఆస్తి నష్టం వాటిల్లింది. సామరస్యంగా చేయాల్సిన ఉద్యమం కాస్తా ఉద్యమనేత ముద్రగడ దుందుడుకు చర్యల వల్ల తీవ్ర ఆవేశానికి దారితీసింది..

మొత్తానికి ఏపీ కేసీఆర్ అన్న ముద్రగడకు కేసీఆర్ లా ఉద్యమాన్ని శాంతియుతంగా నిర్వహించడంలో విఫలమైనట్టే కనిపిస్తోంది.. ఇప్పటికైనా ఆయన ఆందోళనకు స్వస్తిపలికి శాంతియుత నిరసన తెలిపి హక్కులు సాధిస్తే ఏపీలో మరో రాజకీయ నేత పురుడుపోసుకున్నట్టే.. ఏపీలో మరో రాజకీయ పార్టీ పుట్టినట్టే..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *