కేసీఆర్ ను ప్రశ్నించిన సీబీఐ

హైదరాబాద్ : సీఎం కేసీఆర్ ను సీబీఐ బృందం ప్రశ్నించింది .కేసీఆర్ గత కాంగ్రెస్ ప్రభుత్వంలో కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో ఏపీ ఫిషరీస్ కార్పొరేషన్ కు ఇచ్చిన కాంట్రాక్టుపై కేసీఆర్ ను సీబీఐ ప్రశ్నించింది.. ఈఎస్ఐ భవనాల నిర్మాణ కాంట్రాక్ట్ ను ఫిషరీస్ డిపార్ట్ మెంట్ కు ఇచ్చి రూ. 5 కోట్ల నష్టం, అవినీతి కి పాల్పడినట్టు ఆరోపణలున్నాయి..

ఈ భారీ కాంట్రాక్టులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వెలుగుబంటి సూర్యనారాయన హయాంలో కాంట్రాక్టులు జారీ చేశారు. ఈ నిర్మాణ కాంట్రాక్ట్ పై సోమవారం కేసీఆర్ ఇంటికి వచ్చిన సీబీఐ బృందం ప్రశ్నించింది.. కేసు దర్యాప్తులో భాగంగా కేసీఆర్ ను ప్రశ్నించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *