
సీఎం కేసీఆర్ ఎంతో కష్టనష్టాలకోర్చి ప్రపంచంలోనే చాలా సులభమైన పారిశ్రామిక విధానాన్ని తెచ్చారు. దీనికి ప్రపంచవ్యాప్తంగా గుర్తుంపు తెచ్చేందుకు దేశవిదేశాలు తిరుగుతున్నారు. కానీ ఫలితం మాత్రం వేరోలా కనపడుతోంది..
కాగా పెట్టుబడులకు అనుకూలమైన రాష్ట్రాల జాబితాను ప్రపంచ బ్యాంకు విడుదల చేసింది.. దేశంలో 72శాతంతో గుజరాత్ పెట్టుబడులకు అనుకూలమైన రాష్ట్రంగా దేశంలో ప్రథమ స్థానంలో నిలిచింది.. 70.12 శాతంతో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో నిలిచింది. ఇక ప్రపంచ ప్రఖ్యాతి పారిశ్రామిక విధానం అన్న తెలంగాణ దేశంలో 13వ స్థానంలో నిలవడం గమనార్హం..
కాగా పెట్టు బడులకు అనువైన రాష్ట్రాల జాబితాను ప్రపంచబ్యాంకు, మేకిన్ ఇండియా సీఐఐ, ఫీక్కీ రూపొందించాయి. ఇందులో తెలంగాణ మంచి విధానం ప్రకటించిన అనుమతుల విషయంలో కఠిన నిబంధనలతో దాని స్థానం 13కి చేరింది. ఏపీలో తొందరగా అనుమతులు సరళంగా ఉన్నాయి. దీంతో ఏపీకి 2వ స్తానం దక్కింది..