కేసీఆర్ నిండు నూరేళ్లు సల్లగా బతకాలి : 90 ఏళ్ల రైతు సిరిపురం సత్తెమ్మ దీవెన

-రైతుబంధు చెక్కు తీసుకున్న వృద్ధురాలు

నిండు నూరేళ్లు సల్లగా బతకాలని 90సంవత్సరాల వృద్ధ రైతు సిరిపురం సత్తమ్మ సీఎం కేసీఆర్ను దీవించింది.
కరీంనగర్ నియోజకవర్గంలో కొత్తపల్లి గ్రామంలో ఆనారోగ్యంతో ఉన్న సిరిపురం సతెమ్మకు 5,000 రైతు బంధు చెక్కును ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఇంటికి వెళ్లి అందించారు. చెక్కు తీసుకున్న సిరిపురం సత్తెమ్మ తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న పథకం పట్ల సంతోషం వెలిబుచ్చింది. రైతుబంధు ఈ కార్యక్రమంలో ఎంపిపి వాసాల రమేష్ ,సర్పంచ్ వాసాల అంబికా దేవి , జడ్పి కో ఆప్షన్ సభ్యులు జమీలుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
రైతు బిడ్డ కెసిఆర్ కు రైతుల బాధలు తెలుసు
-ఎమ్మెల్యే గంగుల కమలాకర్
పండుగ వాతావరణంలో రైతుబంధు కార్యక్రమాలు
-గ్రామ గ్రామాన ఎమ్మెల్యేకు జనం నీరాజనాలు

వ్యవసాయ కుటుంబం మంచి వచ్చిన రైతు బిడ్డ కేసిఆర్ కె రైతులు పడే బాధలు తెలుసని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కొనియాడారు. కరీంనగర్ నియోజకవర్గంలోని చేగుర్తి, చెర్లభుత్కూర్, ఎలబోతారం గ్రామాల్లో రైతు బంధు చెక్కులు , పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కు అడుగడుగునా జనం నీరాజనాలు పలికారు.
డప్పు చప్పుళ్ళు , కోలాటాలు , ఒగ్గు కళాకారుల విన్యాసాలు ఎడ్లబండ్ల ర్యాలీల తో ఊరేగించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వాల హయాంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదురుకున్నారు. రైతు సమస్యలు తెలిసిన వ్యక్తి గా ముఖ్యమంత్రి రైతుబంధు పథకం ప్రవేశ పెట్టారన్నారు. గతంలో రైతులు పెట్టుబడికి డబ్బులు లేక ఉన్న భూమిని అమ్ముకునేవారు అని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెసు హయాంలో సాగుభూములన్ని రియల్ ఎస్టేట్స్ వ్యాపారులకు అమ్ముకున్నారనీ ఎద్దేవ చేశారు. అప్పుల పలు అయి ఆత్మ హత్యలు చేసుకున్నారనీ బాధను వ్యక్తం చేశారు. కాళేశ్వరం నీళ్ళతో భూములన్నీ సస్యసమలం చేస్తామనీ హామీ ఇచ్చారు. రైతులకు 24 గంటలు నాణ్యమైన విద్యుత్తు అందిస్తున్న ఘనత తమ ప్రభుత్వానిదేనని గర్వం వ్యక్తం చేశారు. పెట్టుబడికి డబ్బులు లేక వడ్డీ వ్యాపారులను ఆశ్రయించేవారనీ గతాన్ని గుర్తు చేశారు. ఎరువుల కోసం రోజులబడి క్యూలో నిలబడేవారనీ, ఇకపై ఆ బాధలు లేవని అన్నారు. భూ ప్రక్షాళన చేసి రైతు వద్దకు వెళ్లి పట్టాదారు పాసు పాసు పుస్తకాలు అందిస్తున్నామన్నారు. పల్లెల్లో రైతులకు నగదు అందడంతో సాగుకు సిద్ధం అవుతున్నారన్నారు. వాన చినుకు పడకముందే రైతుల గడపకు వచ్చి పెట్టుబడి ఇస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని గర్వించారు. రైతులకు త్వరలో 5 లక్షల ప్రమాీమా అందించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎం.పి.పి వాసాల రమేష్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, పలు గ్రామాల రైతులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *