కేసీఆర్ ది తొక్కేసిన చంద్రబాబు..

వినడానికి కొంచెం ఎబ్బెట్టుగా ఉన్నా ఇది నిజం.. కేసీఆర్ ది తొక్కేసిన చంద్రబాబు అంటే అదేదో అనుకునేరు.. ఆ తొక్కేయడం అంటే పద్దతులన్నమాట.. కేసీఆర్ రాజకీయ వ్యూహానికి తెలంగాణలో టీడీపీ తట్టాబుట్టా సర్దుకొని పోవాల్సిన దుస్థితి తలెత్తింది. టీడీపీ శాసనసభా పక్షనేతగా చేసిన ఎర్రబెల్లి సహా 10 మంది టీడీపీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరడంతో కేసీఆర్ తలపెట్టిన ‘ఆపరేషన్ టీడీపీ’ పూర్తయ్యిందనే చెప్పాలి. ఇక మిగిలిన నలుగురు ఎమ్మెల్యేలల్లో రేవంత్ మినహా మిగతా వారు టీఆర్ఎస్ లో చేరడానికి సిద్ధంగా ఉన్నారు.
తెలంగాణ ఇంతలా ప్రతిపక్షాలను తుత్తునియలు చేసిన కేసీఆర్ కు పోటీగా ప్రస్తుతం ఏ రాజకీయ నేత సమైక్య ఆంధ్రలో, తెలంగాణలో లేరంటే అతిశయోక్తి కాదు. చంద్రబాబు సైతం కేసీఆర్ పాలనను కేబినెట్ మీటింగుల్లో మెచ్చుకుంటున్నారు. కేసీఆర్ అమలు చేసిన ఆపరేషన్ ఆకర్ష్ ను లేట్ గా అయిన చంద్రబాబు అమలు చేయడం మొదలెట్టారు. తొట్టతొలిగా 8 మంది వైసీపీ ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకొని కేసీఆర్ అడుగులనే తొక్కేసాడన్నమాట..

నిజానికి చంద్రబాబు ఈ పని ఎప్పుడో చేయాల్సింది. రాజకీయంగా స్థిరంగా ఉంటే సుపరిపాలన అందించవచ్చన్న కేసీఆర్ స్ట్రాటజీని బాబు విస్మరించారు. అందుకే దెబ్బైపోయాడు.. ఓ వైపు కాపు ఉద్యమం, మరో వైపు ఇప్పుడు రాజధాని భూముల కుంభకోణంతో తల బొప్పి కట్టి అభివృద్ధి సంగతి పక్కన పెట్టి సమస్యల పరిష్కారంపై దృష్టిపెట్టారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తున్న తోటి మంత్రుల్ని సైతం‘పనిచేస్తే చేయండి.. లేదంటే పక్కకు తప్పుకోండి.. కొత్తవారిని తీసుకుంటా’ అంటూ చంద్రబాబు హూంకరిస్తున్నారట…

ఇటీవల చంద్రబాబు ఇంటెలిజెన్స్ తో పాటు కొన్ని సంస్థలతో టీడీపీ పాలనపై ఏపీలో సర్వే చేయించారట.. అందులో మంత్రులు, ఎమ్మెల్యేల అవినీతిపై, పనులు చేయకపోవడం ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారని..నివేదిక వచ్చింది.. దీంతో తాను పనిచేస్తున్నా.. మంత్రులు, ఎమ్మెల్యేల వల్ల తాను మునిగిపోతున్నానంటూ ఆగ్రహం వ్యక్తం చేశారట చంద్రబాబు..బెజవాడ సీఎం చంద్రబాబు కార్యాలయంలో చంద్రబాబు మంత్రులకు భారీ క్లాస్ పీకరట. పనిచేయకపోతే పక్కనపెడతానని.. పనిచేసేవారినే వెతుక్కుంటానని చెప్పారట.. కేసీఆర్ పాలనను మెచ్చుకున్నాడట.. అందుకే కేసీఆర్ లా ప్రతిపక్షాలను నిర్వీర్యం చేసే ఎత్తుగడను స్ట్రాట్ చేసి వైసీపీ ఎమ్మెల్యేలను లాగే పనిలో పడ్డాడు..

మొత్తానికి కేసీఆర్ బాటలోనే నడుస్తున్న చంద్రబాబుకు ప్రతిపక్షం వైసీపీ కొరకరాని కొయ్యలా మారింది. ఇటీవలే రాజధాని భూముల కొనుగోలు అక్రమాలపై ఏపీ ఎడిషన్ లో 4 పేజీల పేద్ద కథనాన్ని వండివార్చి చంద్రబాబును, మంత్రులకు మకిలి అంటించింది. దీంతో చంద్రబాబు కేసీఆర్ ను ఫాలో అయ్యి ప్రతిపక్షాలను తుత్తునియలు చేస్తారా.. లేక ఓడిపోతారా అన్నది ఆసక్తి నెలకొంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *