కేసీఆర్ ది చెవిటి ప్రభుత్వం

తెలంగాణలో పరిపాలిస్తున్న సీఎం కేసీఆర్ ది చెవిటి ప్రభుత్వమని ఐజేయూ సెక్రటరీ జనరల్ దేవులపల్లి అమర్ , ఐజేయూ నాయకులు కే.శ్రీనివాస్ రెడ్డి మండిపడ్డారు. హైదరాబాద్ లోని మాసాబ్ ట్యాంకు సమాచార శాఖ (ఐ అండ్ పీఆర్) భవన్ కార్యాలయం ఎదుట జర్నలిస్టుల సమస్యలపై మంగళవారం ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ (ఐజేయూ), తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ( టీయూడబ్ల్యూజే) ఆధ్వర్యంలో జర్నలిస్టులు నిరసన దీక్ష చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా ఈరోజు కలెక్టరేట్ల వద్ద టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో జర్నలిస్టులు దీక్షలు జిల్లాల్లో కొనసాగిస్తున్నారు..

tuwj.jpg23virahath

ఈ సందర్భంగా ఐజేయూ సెక్రటరీ జనరల్ దేవులపల్లి అమర్ , ఐజేయూ నాయకులు కే.శ్రీనివాస్ రెడ్డి లు మాట్లాడుతూ ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యలపై నిర్లక్ష్యం వహిస్తోందన్నారు.. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హామీలనే తాము నెరవేర్చాలని కోరుతున్నామన్నారు. గతంలో జారీచేసిన జీవోలను అమలు చేయాలని డిమాండ్ చేశారు… ఇప్పటికే తెలంగాణలో హెల్త్ కార్డులు లేక సంవత్సరన్నర కాలంలో 150 మంది చనిపోయరని వాపోయారు.. ఇకనైనా జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించకుంటే తెలంగాణ అసెంబ్లీని ముట్టడిస్తామని తెలిపారు… ఈ చెవిటి ప్రభుత్వానికి వినపడేలా ఉద్యమం చేసి హక్కులు సాధించుకుంటామని జర్నలిస్టుల నాయకులు ప్రతిన బూనారు. త్వరలోనే జర్నలిస్టుల సమస్యలపై చలో అసెంబ్లీని నిర్వహిస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యులు కే. అమర్ నాథ్, టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు నగునూరి శేఖర్, ప్రధాన కార్యదర్శి విరాహత్ అలీ, ఐజేయూ జాతీయ కార్యవర్గ సభ్యులు కే.సత్యనారాయణ, ఎంఏ మాజిద్, తెలంగాణ ఆన్ లైన్ మీడియా జర్నలిస్టుల అసోసియేషన్ (టోమ్జా) రాష్ట్ర అధ్యక్షులు అయిలు రమేశ్, టీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏ.రాజేశ్, బల్మూరి విజయసింహారావు, హెచ్ యూ జే కార్యదర్శి వెలిచాల చంద్రశేఖర్, రంగారెడ్డి అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి, కార్యదర్శి బాలరాజు, యూనియన్ నాయకులు మేకపోతుల మల్లయ్య, యాదగిరి, దేవులపల్లి అజయ్, సంపత్ కుమార్, షిరిడీ సుధాకర్, శంకర్ గౌడ్, రాధ, భాస్కర్ రెడ్డి, సత్యవతి, వెంకటేశ్, తదితరులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *