
తెలంగాణలో చౌకమద్యంపై కేసీఆర్ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సంఘాలు, కాంగ్రెస్, ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున చౌకమద్యం వద్దంటూ ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం చౌకమద్యం పై ప్రవేశ పెట్టమని ప్రకటించింది. ఈ మేరకు బుధవారం జరిగిన తెలంగాణ మంత్రిమండలి సమావేశంలో నిర్ణయించారు.
చౌక మద్యం ప్రతిపాదనను ఉపసంహరించుకుంటామని.. ఈ సారికి పాత విధానమే కొనసాగిస్తామని కేసీఆర్ విలేకరులతో ప్రకటించారు. అదే సమయంలో మద్యంపై పాత విధానమే కొనసాగిస్తామని చెప్పారు. ఇదే సమయంలో గుడుంబాపై ఉక్కుపాద మోపుతున్నట్లు ప్రకటించారు.