
హైదరాబాద్, ప్రతినిధి : ఈ శనివారం హైదరాబాద్ వస్తున్న బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, సాయంత్రం 4 గంటలకు తెలంగాణ సీఎం కేసీఆర్తో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. అయితే ఈ భేటీకి వెనుక గల కారణాలు ఏంటనేది మాత్రం ఇంకా తెలియరాలేదు.
సినీ, వ్యాపార, క్రీడా ప్రముఖులు అందరూ కలిసినట్లుగానే అమితాబ్ కూడా కేసీఆర్ని కలుస్తున్నారా లేక ఇంకా మరేదైనా ప్రత్యేక పనిమీదే సమావేశమయ్యేందుకు డిసైడ్ అయ్యారా అనే ఉత్కంఠ సినీ, రాజకీయ వర్గాల్లో నెలకొని వుంది.