కేసీఆర్ తో కోదండ రాం ఫైట్

రిటైర్ అయన తర్వాత సార్ కోదండరాం స్పీడు పెంచారు. ఉద్యోగాలనుంచి దిగిపోయి సన్మానాలందుకున్న వెంటనే ఉద్యమాకారుడిగా పూర్తిస్థాయి బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం తెలంగాణలో రైతుల ఆత్మహత్యలపై జరుగుతున్న ఇష్యూను ఆయన రేజ్ చేస్తున్నారు. ఇటీవల హైకోర్టులో తెలంగాణ జనచైతన్య సమితి రైతుల ఆత్మహత్యలపై పిటీషన్ వేసింది. ఇప్పుడు అదే పిటీషన్ పై కోదండరాం ఇంప్లిడ్ అయ్యి కేసీఆర్ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదంటూ పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్ర విద్యావంతుల వేదిక తరఫున ఆయన రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలపై ప్రభుత్వం తీరు బాగాలేదని.. పురిగొల్పే విధంగా ఉందని హైకోర్టులో పిటీషన్ వేశారు. స్వామినాథన్ కమిటీ ఇచ్చిన సిఫారసులను సర్కారు పట్టించుకోవడంలేదని.. సిఫారసులను అమలు చేయాలని కేసీఆర్ ను ఆదేశించాలని కేసీఆర్ ను కోరారు.

కోదండరాంలు కేసీఆర్ లు ఉద్యమ సమయంలో క్లోజ్ గానే ఉన్నా సీఎం అయిన తర్వాత కేసీఆర్ పట్టించుకోలేదు.. దీంతో ఓపిక పట్టిన కోదండరాం ఇక పోరుబాట పట్టారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *