
ఏపీ సీఎం చంద్రబాబు హైదరాబాద్ ను పూర్తిగా వీడేందుకు నిర్ణయించారు. ఏపీ నూతన రాజధాని అమరావతి నిర్మాణం పూర్తయ్యే వరకు సీఎం చంద్రబాబు విజయవాడలో తనకోసం కృష్ణ నది తీరంలో నూతనంగా నిర్మించిన సీఎం క్యాంప్ ఆఫీసు నుంచే పాలన సాగించనున్నారు.
ఈ మేరకు నిన్న మంత్రులు , అధికారులతో సమీక్ష సమావేశంలో నిర్ణయించారు. ఏపీ నూతన రాజధాని అమరావతిని నిర్మాణం అయ్యే వరకు విజయవాడే మనకు రాజధాని అని విజయవాడలో రోడ్లు, మౌళిక సదుపాయాల కోసం 100 కోట్లు కేటాయిస్తున్నట్లు చెప్పారు. అధికారులు, మంత్రులు కూడా విజయవాడకు తరలిరావాలని కోరారు.
కాగా చంద్రబాబు హైదరాబాద్ ను వీడేందుకు మరో కారణం కూడా ఉంది. హైదరాబాద్ లో ఉంటూ ఓటుకు నోటు లో దొరికిన చంద్రబాబు ఇక తెలంగాణ లో ఉంటూ పుల్లలు పెడితే తనకే మూడితుందని గ్రహించే ఏపీకి పయనమయ్యాడని.. దీనివల్ల కేసీఆర్ కూడా సైలెంట్ అవుతాడని చంద్రబాబు గ్రహించారు. అందుకే ఇక ఏపీనుంచే పాలనకు ముహూర్తం పెట్టారు.