కేసీఆర్ తోనే సుపరిపాలన

కేసీఆర్ తోనే సుపరిపాలన

– తాజా మాజీ తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్
– ధర్మారంలో టీఆర్ఎస్ ప్రచారం
కేసీఆర్ తోనే సుపరిపాలన సాధ్యమని తాజా మాజీ తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో బంజేరుపల్లి, కటికనపల్లి, చామనపల్లి, కొత్తపల్లి, గ్రామాల్లో టీఆర్ఎస్ ప్రచారం నిర్వహించారు. టీఆర్ఎస్ తోనే తెలంగాణ సస్యశ్యామలమవుతుందన్నారు. ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ఓటేసి మరోసారి గెలిపించాలని కోరారు. సీఎం కేసీఆర్ ప్రకటించిన పాక్షిక మేనిఫెస్టోతో కాంగ్రెస్ నేతలు బెంబేలెత్తుతున్నారన్నారు. ఓటమి భయంతోనే టీఆర్ఎస్ మేనిఫెస్టోను విమర్శిస్తున్నారన్నారు. దాచుకోవడం, దోచుకోవడం కాంగ్రెస్ కే తెలుసన్నారు. బడుగుబలహీన వర్గాల అభివృద్ధి టీఆర్ఎస్ తోనే సాధ్యమవుతుందన్నారు. మరోసారి టీఆర్ఎస్ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నట్లు చెప్పారు. ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులను తరిమికొట్టాలన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంతోనే గ్రామాలు అభివృద్ధి చెందాయని, గత ప్రభుత్వాలు అభివృద్ధిని విస్మరించాయని అన్నారు. సీఎం కేసీఆర్ తెలంగాణలోని అన్ని కులాలకు సముచిత స్థానం కల్పిస్తున్నారన్నారు. ప్రత్యేక కార్పొరేషన్ లు ఏర్పాటు చేసి నిధులు మంజూరు చేస్తున్నారన్నారు. కుల వృత్తులను ప్రోత్సహించేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నారన్నారు. రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.

KOPPULA ESHWAR 1     KOPPULA ESHWAR 2     KOPPULA ESHWAR 3

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *