
వీణవంక మండలంలోని పెద్ద పాపయ్య పల్లి శివాలయంలో మంత్రి ఈటల రాజేందర్ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ కు పట్టం కట్టడానికి ప్రజలు సన్నద్ధమవుతున్నారని, ఎన్నికల్లో కాంగ్రెస్ డిపాజిట్లు గల్లంతవ్వడం ఖాయమని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాలతో పాటు నియోజకవర్గంలో తాను చేపట్టిన అభివృద్ధి పనులే ఎన్నికల్లో టీఆర్ఎస్ కు భారీ విజయాన్నందిస్తాయన్నారు. ఎన్నికల్లో యువత సైనికుల్లా పని చేయాలని పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ కు అధికారం కల్లా అన్నారు. కేసీఆర్ ను సీఎంగా మరోసారి చూడాలన్నదే ప్రజల కోరికన్నారు. గ్రామాల్లో ప్రజలు టీఆర్ఎస్ కు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. అంతకుముందు ప్రజలు ఈటలకు అపూర్వ స్వాగతం పలికారు.