కేసీఆర్ తోనే పారదర్శక పాలన

కేసీఆర్ తోనే పారదర్శక పాలన సాధ్యమని తాజా మాజీ ఎమ్మెల్యే, ధర్మపురి నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర అన్నారు. జగిత్యాల జిల్లా పార్టీ కార్యాలయంలో బొట్ల వనపర్తి గ్రామ వాస్తవ్యుడు జనసేన పార్టీ ఉమ్మడి కరీంనగర్ నాయకుడు మూల హరీష్ గౌడ్ టీఆర్ఎస్ కు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని వర్గాల సంక్షమమే టీఆర్ఎస్ లక్ష్యమని, అందులో భాగంగా అనేక పథకాలు ప్రవేశపెట్టి అమలు చేసిందని అన్నారు. టీఆర్ఎస్ తోనే తెలంగాణలోని అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు. నాలుగున్నరేళ్లలో జరిగిన అభివృద్ధితో టీఆర్ఎస్ లభిస్తున్న ప్రజాదరణన చూడలేక కాంగ్రెస్ కుట్ర పన్నిందని, అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకోవడమే పనిగా పెట్టుకుందని అన్నారు. వారికి గుణపాఠం చెప్పాలనే సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లారని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో ఓట్ల కోసం వచ్చే మహాకూటమి నాయకులకు బుద్ధి చెప్పాలన్నారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా రాష్ట్ర్రంలోనూ, నియోజకవర్గంలోనూ టీఆర్ఎస్ విజయం ఖాయమని, దాన్ని ఆపడం ఎవరి తరమూ కాదని అన్నారు. కాంగ్రెస్ నాయకుల కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని, ఎన్నికల్లో గుణపాఠం చెప్పాడానికి సిద్ధమవుతున్నారని అన్నారు. టీఆర్ఎస్ కు భారీ మెజార్టీని అందించేందుకు కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలని, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *