కేసీఆర్ తోనే గిరిజనుల కల సాకారం

కేసీఆర్ తోనే గిరిజనుల కల సాకారం

-పాలకుర్తి టీఆర్ఎస్ అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్ రావు
కేసీఆర్ తోనే దశాబ్దాల గిరిజనుల కల సాకారమైందని పాలకుర్తి టీఆర్ఎస్ అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. మహబూబాబాద్ జిల్లా తోర్రుర్ మండలం కాంఠయపాలెం గ్రామ పంచాయతీ పరిధిలోని కస్నా తండాలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు మంగళహారతులు, డప్పుచప్పుళ్లతో ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తండాలను గ్రామపంచాయతీలుగా ప్రకటించిన ఘనత కేసీఆర్ కే దక్కిందన్నారు. చిన్న పంచాయతీలతోనే గ్రామాలు అభివృద్జి చెందుతాయని అన్నారు. రాబోయే రోజుల్లో గ్రామాల్లో అభివృద్ది వేగవంతమవుతుందన్నారు. ప్రతీ తండాకు సీసీ రోడ్డు, డ్రెయినేజీల నిర్మాణం చేపడతామన్నారు. ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. మాజీ ఎమ్మెల్యే ఎన్.సుధాకర్, జీసీసీ చైర్మన్ గాంధీనాయక్, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు

టీఆర్ఎస్ లో చేరికలు
కాంఠయపాలెం గ్రామంలోని కాంగ్రెస్ కు చెందిన మంధపూరి శ్రీనివాస్ బీసీ సెల్ మాజీ కార్యదర్శి, పంజాల అల్లోరు, గోనె రాజు ఆటో యూనియన్ అధ్యక్షుడు టీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

errabelli dayakar rao 1     errabelli dayakar rao 2     errabelli dayakar rao 3

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *