కేసీఆర్ జాతీయ ప్రత్యామ్నాయ ఆలోచనకు భారీ స్పందన 

జాతీయ , ప్రాంతీయ మీడియాల్లో లోతైన చర్చ 
తమదైన శైలిలో విశ్లేషిస్తున్న ప్రింట్-ఎలక్ట్రానిక్ మీడియా 
కాంగ్రెస్ – బీజేపీ వ్యతిరేక శక్తుల్లో ఆనందం 
మేధావుల భేటీకి కార్యాచరణ ప్రకటించిన కేసీఆర్ 
కేసీఆర్ ఎజెండా తర్వాత భారీ స్పందనకు అవకాశం
కేసీఆర్ కు పెరుగుతున్న రాజకీయ మద్దతు 
మొన్న బెంగాల్ సీఎం,నిన్న ఛత్తీస్ ఘడ్ మాజీ సీఎం

దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు రావాలనే సంకల్పంతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన భారత ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక ప్రకటన ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది . దేశంలోని మొత్తం జాతీయ మీడియా ఇప్పుడు ఈ అంశం గురించే చర్చిస్తున్నాయి . ఇంగ్లిష్ , హిందీ , తెలుగు సహా అనేక ప్రాంతీయ బాషా ప్రింట్ , ఎలక్ట్రానిక్ మీడియా తమ శైలిలో రాజకీయ విశ్లేషణలు చేస్తున్నాయి . దేశంలోని మేధావులు , వివిధ రంగాల్లో సేవలందించిన ప్రముఖులతో ప్రధాన నగరాల్లో చర్చలు జరపనున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న ప్రకటించడంతో రాజకీయ వేడి ఊపందుకుంది . పద్నాలుగేళ్ళు ప్రజా ఉద్యమాన్ని నిర్మించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా ఎమ్మెల్యేగా , రాష్ట్ర , కేంద్ర మంత్రిగా , ముఖ్యమంత్రిగా పని చేసిన అనుభవం ఉన్న నాయకుడిగా పేరున్న కేసీఆర్ ప్రత్యామ్నాయ రాజకీయవేదిక నిర్మాణంలో సక్సెస్ అవుతారన్న అభిప్రాయాన్ని చాలా వరకు జాతీయ మీడియా అభిప్రాయంలో వ్యక్తమవుతున్నది . తెలంగాణ కు ఏకాభిప్రాయాన్ని సాధించే క్రమంలో ఈ దేశంలో ఉన్న దాదాపు అన్ని రాజకీయ పార్టీల ప్రముఖులతో కేసీఆర్ సంబంధాలు కొనసాగించారని , ఆ పరిచయాలు ఇప్పుడు ప్రత్యామ్నాయ వేదిక నిర్మాణంలో కేసీఆర్ కు ఉపయోగపడతాయని జాతీయ మీడియా విశ్లేషిస్తున్నది . ఎమ్మెల్యే నుండి రాష్ట్ర , కేంద్ర మంత్రిగా , ముఖ్యమంత్రిగా పని చేసిన అనుభవం కూడా కేసీఆర్ జాతీయ ప్రత్యామ్నాయ ఎజెండాను అద్భుతంగా రూపొందించడానికి ఉపకరిస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు .

kcr 2  kcr3  kcr 4  kcr 5

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.