కేసీఆర్ చేతుల మీదుగా అమితాబ్ కు అక్కినేని అవార్డు

హైదరాబాద్ ,ప్రతినిధి : బాలీవుడ్ సూపర్ స్టార్ బీగ్‌బీ అమితాబ్ బచ్చన్‌ తెలంగాణ సీఎం కేసీఆర్ చేతుల మీదుగా  అక్కినేని లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డు అందుకున్నారు. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో జరిగిన ఈ అవార్డు ప్రజెంటేషన్ సెరెమనీకి కేంద్రమంత్రి వెంకయ్యనాయుడుతో పాటు చిరంజీవి, రాజేంద్ర ప్రసాద్, కృష్ణంరాజు, సుబ్బరామి రెడ్డి, జయసుధ, సమంత, ఇంకా ఇతర సినీ ప్రముఖులెందరో హాజరయ్యారు.

అమితాబ్‌కి అక్కినేని అవార్డుతో గౌరవించడం సరైన సత్కారం అంటూ అక్కడికి వచ్చిన సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు అభిప్రాయపడ్డారు. అమితాబ్‌కి అక్కినేని అవార్డుతో సత్కరిస్తున్నందుకు అక్కినేని కుటుంబం కూడా ఎంతో ఆనందాన్ని వ్యక్తపరిచింది.

ఈ కార్యక్రమానికి హాజరైన మాజీ కేంద్రమంత్రి చిరంజీవి మాట్లాడుతూ అక్కినేని లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డు అమితాబ్ బచ్చన్ కు ఇవ్వడం సంతోషకరమన్నారు. దీంతో అవార్డుకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించిందన్నారు. 2005 నుంచి ఈ అవార్డులు ఇస్తున్నారని తెలిపారు.
అనంతరం సినీనటి సమంత మాట్లాడుతూ అక్కినేనితో కలిసి చిత్రంలో సినిమాలో పనిచేసినందుకు చాలా సంతోషకంగా ఉందన్నారు. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ తోపాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.