‘కేసీఆర్-చిల్లర-నదీమ తల్లులు’ ఓ కథ..

సీఎం కేసీఆర్ తెలంగాణ నీటి గోసను అసెంబ్లీసాక్షిగా వెళ్లగక్కారు. తెలంగాణలో గోదావరి కృష్ణ నదులు పారుతున్నా ఇంకా బొగ్గు బాయిల్లో దుబాయ్ అంటూ వలసపోవాల్సిన దుస్థితిని కల్పించిన సమైక్య పాలకులపై మండిపడ్డారు. ఈ సందర్భంగా తెలంగాణలోని నదులపై ప్రాజెక్టులు కట్టని అసమర్థ పాలకులను తూలనాడారు..

ఈ సందర్భంగా అసెంబ్లీ లో ప్రాజెక్టులపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇస్తూ.. మాట్లాడారు.. ‘ తాను కృష్ణ ,గోదావరి నదులు ప్రవహిస్తున్న ఏరియాల్లో పర్యటిస్తే తన వద్ద ముప్పై ఏళ్లుగా డ్రైవర్ గా పనిచేస్తున్న బాలయ్య ఎప్పుడు వాహనంలో చిల్లర ఉంచుకుంటాడని తెలిపారు. నదుల వద్దకు వెళ్లగానే తాను అడగగానే చిల్లర ఇస్తాడని.. తాను నదుల్లో చిల్లర నాణేలు వేసి నదీమ తల్లులకు మొక్కుతానని చెప్పారు. ఇప్పటివరకు తెలంగాణలో ఎవరూ వేయని నాణేలను తాను నదిలో వేసానని.. తెలంగాణ దుర్భిక్షాన్ని పారుదోలు తల్లీ అని వేడుకున్నానని’’ కేసీఆర్ భావోద్వేగంతో అసెంబ్లీలో మాట్లాడి అందరి హృదయాలను టచ్ చేశాడు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *