Breaking News

కేసీఆర్ చండీయాగానికి పండిట్ రవిశంకర్, రామోజీరావు

KCR-Chandi-680x250

మెదక్ : సీఎం కేసీఆర్ ఎర్రవెల్లిలోని తన ఫాంహౌస్ లో నిర్వహిస్తున్న అయుత చండీయాగానికి ప్రముఖులు తరలివచ్చి పూజలు చేస్తున్నారు. ఉదయం 9.00 గంటలకు ప్రారంభమైన అయుత చండీయాగంలో మొదట కేసీఆర్ తో పాటు గవర్నర్ నరసింహన్ దంపతులు హోమం ఎదుట కూర్చొని చండీయాగన్ని ప్రారంభించారు..

అనంతరం మధ్యాహ్నం సమయంలో ఆధ్యాత్మిక గురువు పంటిట్ రవిశంకర్, ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు, పలువురు మంత్రులు కడియం శ్రీహరి, తుమ్మల నాగేశ్వరరావులు హాజరయ్యారు. హంపీ, శృంగేరీ పీఠాధిపతులు హాజరై పూజలు చేశారు. కాగా చండీయాగానికి వచ్చే అతిథులను , ఏర్పాట్లను మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు, అతిథులకు మర్యాదలను దగ్గరుండీ చేస్తున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *