కేసీఆర్ కోసం కొత్త భవనమండీ..

సీఎం కేసీఆర్ మరో సారి తన ప్రత్యేకత చాటుకున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి అధికారిక నివాసం కోసం 30 కోట్లు వెచ్చించి భారీ భవంతిని నిర్మించడానికి శంకుస్థాపన చేశారు. అత్యాధునిక హంగులు సదుపాయాలు గల ఈ భవనం 8.9 ఎకరాల్లో హైదరాబాద్ లోని పంజాగుట్టలో నిర్మించనున్నారు. 8 నుంచి 9 నెలల్లో పూర్తి కానున్న ఈ భవనం ను ప్రస్తుతం మున్న క్యాంపు కార్యాలయం పక్కనే నిర్మిస్తున్నారు.

శంకుస్థాపన కార్యక్రమాన్ని సీఎం దంపతులు పూర్తి చేశారు. సమావేశాలకు, అధికారులతో భేటిలకు, ప్రముఖులతో సమావేశాలకు ఇప్పుడున్న భవనం అనువుగా లేక ఆరుబయటే భారీ సంఖ్యలో వచ్చిన నాయకులతో చర్చించాల్సిన దుస్థితి నెలకొంది. కొత్త భవనం పూర్తయితే సమావేశాలకు, భేటిలకు, అందరికీ అనువుగా అత్యాధునిక సదుపాయాలతో నిర్మితం కానుంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *