కేసీఆర్ కొత్త సంవత్సర కానుక

kcr-develop-film-industry

సీఎం కేసీఆర్ తెలంగాణలో కొత్త సంవత్సర కానుకనందించారు. నిరుద్యోగులు, ఉద్యోగులకు, ఒప్పంద, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు తీపి కబురునందించారు.. సీఎం కేసీఆర్ సమీక్షలో ఈ కీలక నిర్ణయాలను వెలువరించారు..

ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న నిరుద్యోగుల కోసం కేసీఆర్.. దాదాపు రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 20వేల ఉపాధ్యాయ నియామకాలను చేపట్టాలని ఆదేశించారు. పోలీస్ శాఖలో 9200 కానిస్టేబుళ్ల నియామకాలకు అంగీకరించారు. ఒప్పంద ఉద్యోగుల క్రమబద్దీకరణకు ఓకే చెప్పారు. నెలాఖరులోగా ఈ ప్రక్రియలను పూర్తి చేసి నిరుద్యోగుల ఆశలు నెరవేర్చాలని ఆదేశించారు. దీనివల్ల దాదాపు 70 వేల మందికి ఒప్పంద కార్మికులకు వాళ్ల ఉద్యోగాలు పర్మనెంట్ కానున్నాయి.. ఇక కేసీఆర్ ఆదేశంతో పోలీస్ శాఖ వెంటనే 9281 కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి వెంటనే ఇవాళ ప్రకటన విడుదల చేసింది..

అలాగే జీహెచ్ఎంసీ లో రూ.1200 వరకు ఉన్న ఆస్తి పన్నును మినహాయిస్తూ గ్రేటర్ ఎన్నికలవేళ కీలక నిర్ణయం తీసుకున్నారు కేసీఆర్.. సచివాలయంలో జరిగిన ఈ భేటిలో మంత్రులు కడియం, ఈటెల,లక్ష్మారెడ్డి, సీఎస్ రాజీవ్ శర్మ, డీజీపీ అనురాగ్ శర్మలు లు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *